Kodali Nani : బహిరంగ ప్రదేశాల్లో చంద్రబాబు సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడానికి వీల్లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుంటూరు తొక్కిసలాటకు చంద్రబాబే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పబ్లిసిటి పిచ్చితో అమాయకులను చంపుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు సమావేశాల వివరాలను పోలీసులకు తెలిపిన తర్వాతనే సభలు, సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
చంద్రబాబు సభలకు అనుమతి ఇవ్వొద్దు : కొడాలి నాని - నేటి తాజా వార్తలు
Ex Minister Kodali Nani : చంద్రబాబు నిర్వహించే సభలు, సమావేశాలపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చేసే పనులకు ప్రజలు బలి అవుతున్నారని ఆరోపించారు. సభలు, సమావేశాల వివరాలను పోలీసులకు అందించిన తర్వాతే ఏర్పాటు చేయాలని అన్నారు.
కొడలి నాని
"చంద్రబాబు సమావేశాలు ఎట్టి పరిస్థితిలోనూ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించటానికి వీల్లేదు. సభకు, సమావేశాలకు ఎంత మంది హాజరవుతున్నారు, ఎన్ని వాహనాలతో ర్యాలీ చేపడ్తున్నారు వంటి వివరాలను పోలీసులకు తెలియజేయాలి." -కొడాలి నాని, మాజీ మంత్రి
ఇవీ చదవండి: