Kidnapped baby found at vikarabad: తెలంగాణలోని ఈ నెల 6వ తేదీన హైదరాబాద్లోని హుమాయున్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నారిని దొంగిలించిన సంఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ నంబర్ 13 వద్ద ఒక యాచకురాలు భిక్షాటన చేస్తూ.. తన 14 నెలల బాబును పోషించుకుంటోంది. అయితే అదే రోజు రాత్రి నిద్రిస్తున్న సమయంలో ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. తన బాబు గురించి హుమాయున్ నగర్ పోలీస్లను ఆశ్రయించింది ఆ తల్లి.
కిడ్నాప్ అయిన పసిపిల్లాడి ఆచూకీ లభ్యం.. ఎందుకు ఎత్తుకెళ్లారంటే..! - ఏపీ నేర వార్తలు
Kidnapped baby found at vikarabad: అభంశుభం తెలియని చిన్నారిని ఎత్తుకొని వెళ్లి యాచక వృత్తిలో దించుదామనుకున్నారు ఇద్దరు మహిళలు. అనుకున్నట్లుగానే పసిపాపాయిని దొంగిలించారు. కానీ పోలీసుల బారినుంచి తప్పించుకోలేకపోయారు.
ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్పెషల్ టీమ్లుగా ఏర్పడ్డారు. ఆ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. వికారాబాద్ వైపు ఇద్దరు వ్యక్తులు బాబును తీసుకువెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు వికారాబాద్ రైల్వే స్టేషన్లో ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పసిపిల్లాడిని తీసుకొని యోగక్షేమాలను చూసుకున్నారు. అదుపులోకి తీసుకొన్న ఇద్దరు మహిళలు దస్తమ్మ, లక్ష్మీలుగా గుర్తించారు. దొంగలించిన చిన్నారిని భిక్షాటన కొరకు వాడుకోవాలని చూశారని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు. పిల్లవాడిని తల్లికి అప్పగించారు.
ఇవీ చదవండి: