Pothina Venkata Mahesh: రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకే వైసీపీ పుట్టిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. పండుగ చేసుకునేందుకు కనీస డబ్బుల్లేక పేదలు నరకం చూస్తున్నారని.. జగన్ పాలనలో సామాన్యులకు ఆత్మహత్యలే శరణ్యం అనేలా చేశారని ధ్వజమెత్తారు. ప్రజలు బయటకి వచ్చి తమ ఆవేదన చెప్పినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. జీవో 1తో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందన్నారు. ఈ అంశాలపైనే చంద్రబాబుతో తమ అధినేత పవన్ కల్యాణ్ కలిశారన్నారు. వైసీపీ వరాహాలు గుంపులుగా వచ్చి పవన్ కల్యాణ్‌పై విషం చిమ్ముతున్నాయి.
జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రం: పోతిన వెంకట మహేష్ - Andhra Pradesh Latest News
Pothina Venkata Mahesh: జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రమని.. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసేందుకే వైసీపీ పుట్టిందని జనసేన అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. జగన్ పాలనలో పండుగ చేసుకునేందుకు కనీస డబ్బులు లేక పేదలు నరకం చూస్తున్నారని ధ్వజమెత్తారు. బ్రిటీష్ చట్టం తెచ్చిన జగన్ రెడ్డి కూడా ఎన్నికల ముందే ఈ రాష్ట్రం వదిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
వైసీపీ నేతలు పదేపదే పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేస్తున్నారంటే వారికి వణుకు పుడుతుందని దుయ్యబట్టారు. తాము తమ వాహనానికి వారాహి అని పేరు పెడితే... వైసీపీ వరాహాలు వాగాయని.. ఇక వాహనం రోడ్డుపైకి వస్తే ప్యాంట్లు తడుపుకుంటారని ఎద్దేవా చేశారు. జగన్ ఈ రాష్ట్రానికి పట్టిన పెద్ద దరిద్రమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కేసుల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారన్నారు. ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్‌గా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ చేసే అవినీతి, అక్రమాలను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. బ్రిటీష్ చట్టం తెచ్చిన జగన్ రెడ్డి కూడా ఎన్నికల ముందే ఈ రాష్ట్రం వదిలిపోవడం ఖాయమని హెచ్చరించారు.
ఇవీ చదవండి: