ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమ అల్లర్ల కేసులు ఎత్తివేయడంపై న్యాయపోరాటం చేస్తాం : జడ శ్రావణ్ కుమార్ - ysrcp government withdraw cases

Jai Bheem Bharat Party : అంబేడ్కర్​ కోనసీమ అల్లర్ల సమయంలో నమోదైన కేసులను.. అధికార వైసీపీ ప్రభుత్వం ఎత్తివేయాటాన్ని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, జడ శ్రావణ్ కుమార్ ఖండించారు. వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆయన ఆరోపించారు.

జడ శ్రావణ్ కుమార్
జడ శ్రావణ్ కుమార్

By

Published : Mar 29, 2023, 7:49 PM IST

Jada Sravan Kumar : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి అంబేడ్కర్​ను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, జడ శ్రావణ్ కుమార్ ఆరోపించారు. అంబేడ్కర్ వారసులైన దళితులు జగన్ రెడ్డి కుట్రలు తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడ్డారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగాన్ని జగన్ ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని దుయ్యబట్టారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టిన సమయంలో మారణ హోమం సృష్టించిన వారిపై పెట్టిన కేసులు ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు. కేసులను ఎత్తివేయటం సమంజసమేనా జగన్ రెడ్డి అని నిలదీశారు.

కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టడమే జగన్ పని అని దుయ్యబట్టారు. కాపుల ఓట్ల కోసం జగన్ ప్రభుత్వం.. కేసుల విత్ డ్రా డ్రామా ఆడుతోందని దుయ్యబట్టారు. తుని ఘటనపై పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కేసులు ఎత్తి వేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ప్రయివేట్ కంపేని నడుపుతున్నారా అని ప్రశ్నించారు. కోర్టు బోనులో నిలబడి ఉండే జగన్​కు బాబాసాహెబ్ అంబేడ్కర్ విలువ ఏమి తెలుసని ఆక్షేపించారు. జగన్ లాంటి నీచమైన రాజకీయాలు దేశంలో ఎవరు చేయాలేరని ఆరోపించారు.

దళితులపై ధమన కాండకు దిగుతూనే.. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహమంటూ డ్రామాలు ఆడుతాడని మండిపడ్డారు. ప్రభుత్వంలో దళితులపై చేసిన దాడులకు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కోనసీమలో ఉద్దేశ్యపూర్వకంగా జగన్ ప్రభుత్వం అల్లర్లు, మారణహోమం సృష్టించిందని శ్రావణ్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంబేడ్కర్​ చరిత్ర ఏంటో జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. కోనసీమ అల్లర్లలో కేసులు ఎత్తివేయడాన్ని జై భీమ్ భారత్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేసులు ఎత్తివేయడంపై న్యాయపోరాటం చేస్తామని శ్రావణ్‌ తేల్చి చెప్పారు. పదే పదే బాబాసాహెబ్ అంబేడ్కర్అం టూ ప్రసంగాలు చేసే పవన్.. కేసుల ఎత్తివేయటంపై ఎందుకు స్పందించలేదని అన్నారు. పవన్ స్పందించకుంటే జనసేన కేవలం కాపుల పార్టీ మాత్రమే అవుతోందని ఆరోపించారు.

కోనసీమ జిల్లాలో జరిగిన మారణ హోమంపై గళం విప్పిన ప్రతిపక్షాలు కేసుల ఉపసంహరణపై గొంతు ఎందుకు విప్పలేదని నిలదీశారు. కోనసీమ అల్లర్ల వెనక జనసేన నాయకులు వున్నారని అందరికీ తెలుసని శ్రావణ్ విమర్శించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాన్ని జనసేన, తెలుగుదేశం పార్టీలు ఖండిచాలని డిమాండ్ చేశారు. దేశానికి సేవ చేసిన అంబేడ్కర్ విగ్రహాలే ఎందుకు కూల్చివేస్తారని మండిపడ్డారు. ఏప్రిల్ 14న ప్రభుత్వం అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే సభను దళితులు బహిష్కరించాలని అన్నారు. కేసులు వెనక్కి తీసుకోవటంపై కోర్టులకు వెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడాల్సిందేనని అన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన.. జీఓ రూపం దాల్చితే సీఎం ఇల్లు ముట్టడికైనా వెనుకాడమని తెలిపారు.

"కాపుల ఓట్ల కోసం జగన్ ప్రభుత్వం కేసులు విత్ డ్రా డ్రామా ఆడుతోంది. తుని ఘటనపై పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కేసులు ఎత్తి వేశారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా లేక ప్రయివేట్ లిమిటెడ్ కంపేని నడుపుతున్నారా. అవినీతి పరుడిగా కోర్టు బోనుల్లో నిలబడే జగన్​కు ఏమి తెలుసు.. బాబాసాహెబ్ అంబేద్కర్ విలువ. జగన్ లాంటి నీచమైన రాజకీయాలు దేశంలో ఎవరు చేయలేరు." - జడ శ్రావణ్ కుమార్, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు

జడ శ్రావణ్ కుమార్, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details