ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలువురు ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు.. ఇందులో ఎవరున్నారంటే?

IPS Officers Promotions: రాష్ట్రంలో పలు ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, అమిత్‌గార్గ్‌, మహేష్‌దీక్షిత్‌లకు డీజీపీ స్థాయి హోదాను కల్పించింది. వీరితో పాటు మరికొంత మందికి కూడా పదోన్నతులు కల్పించింది.

ips officers promotions
ఐపీఎస్ అధికారులకు పదోన్నతులు

By

Published : Dec 31, 2022, 2:56 PM IST

IPS Officers Promotions: రాష్ట్రంలో పలు ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతి లభించింది. సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్‌, అమిత్‌గార్గ్‌, మహేష్‌దీక్షిత్‌లకు డీజీపీ స్థాయి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం పీవీ.సునీల్‌కుమార్‌ సీఐడీ ఏడీజీగా, అమిత్‌గార్గ్‌, మహేష్‌దీక్షిత్‌లు కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో పనిచేస్తున్నారు. వీరితోపాటు మహేష్‌చంద్రలడ్డాకు ఏడీజీగా పదోన్నతి లభించింది. శ్యాంసుందర్‌, త్రివిక్రమ్‌వర్మ, బాలరాజులకు ఐజీగా.. కోయా ప్రవీణ్‌, భాస్కర్‌భూషణ్‌, అమ్మిరెడ్డిలకు డీఐజీలుగా పదోన్నతిని ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీపికాపాటిల్‌, కృష్ణారావు, అమిత్‌బర్దార్‌లకు జూనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ గ్రేడ్లుగా పదోన్నతి లభించింది.

ABOUT THE AUTHOR

...view details