ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Indrakeeladri Dasara Navaratri Start From Oct 15 : ఇంద్రకీలాద్రి పై అక్టోబర్‌ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు - Indrakeeladri Dasara Navaratri

Indrakeeladri Dasara Navaratri Start From Oct 15 : ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు దసరా శరన్నవరాత్రి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టుబోర్డు ఛైర్మన్‌ రాంబాబు తెలిపారు. తిథులను అనుసరించి అలంకరణ చేయడం వల్ల ప్రతి సంవత్సరం చేసే స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అవతారం ఈ సారి చేయడం లేదన్నారు. కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రుల గురించి పుర్తిగా తెలుసుకుందాం ..

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 20, 2023, 12:15 PM IST

Indrakeeladri Dasara Navaratri Start From Oct 15 : ఇంద్రకీలాద్రి పై అక్టోబర్‌ 15 నుంచి దసరా శరన్నవరాత్రి వేడుకలు

Indrakeeladri Dasara Navaratri Start From Oct 15 :విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రులను అక్టోబరు 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం పాలకమండలి, వైదిక కమిటీ, అధికారులు ప్రకటించారు. ఈ నవరాత్రులకు అమ్మవారిని తొలిసారిగా చండీ రూపంలో అలంకరించనున్నారు. ఉత్సవాల నిర్వహణ కోసం ఏడు కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గత సంవత్సరం మాదిరిగానే పకడ్భందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కొండచరియలు విరిగిపడుతున్నందున- క్యూలైన్లను దుర్గాఘాట్‌ వైపునకు మార్పు చేశారు. భక్తులు ప్రత్యేక ఖడ్గమాల అర్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనేలా రుసుములను నిర్ణయించారు. వీటి టిక్కెట్లను ఆన్‌లైన్‌లో పొందవచ్చని తెలిపారు.

Indrakeeladri: శాస్త్రోక్తంగా.. ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి యాగం

Durga navaratri 2023 :ఆలయ పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో దర్భముళ్ల భ్రమరాంబ, పాలకమండలి సభ్యులు, ఇంజినీర్లు, వైదిక కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై- ఉత్సవాల ఏర్పాట్లను మీడియాకు వివరించారు. అక్టోబర్ 15వ తేదీ నుంచి 23వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో మొత్తం పది అలంకరణల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొమ్మిది రోజుల్లో చివరి రోజున అమ్మవారిని రెండు రూపాల్లో అలంకరిస్తారు. అక్టోబరు 15న బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. అక్టోబరు 16న గాయత్రీదేవిగా అమ్మవారిని అలంకరిస్తారు.

Indrakeeladri Giri Pradakshina: అంగరంగ వైభవంగా సాగిన ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ

అక్టోబరు 17న అన్నపూర్ణాదేవిగా, 18న మహాలక్ష్మిదేవిగా, 19న మహాచండీదేవిగా, 20న మూలానక్షత్రం రోజున సరస్వతీదేవిగా, 21న లలితా త్రిపురసుందరీదేవిగా, 22న దుర్గాదేవిగా అలంకరిస్తారు. ఉత్సవాల చివరి రోజున ఉదయం మహిషాసుర మర్దినీదేవిగా, మధ్యాహ్నం రాజరాజేశ్వరిదేవిగా అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అక్టోబరు 20వ తేదీన మూలానక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు..

Vijayawada Kanaka Durga Temple : ఈ ఏడాది ఇంజనీరింగ్‌ పనులకు సుమారు 2.5 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు తెలిపారు. కొండచరియలు జారిపడిన కారణంగా ఆ ప్రదేశంలోని క్యూలైన్లు దుర్గాఘాట్ వైపు మారుస్తామని... దసరా రోజులలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అంతరాలయ దర్శనం ఉండదని తెలిపారు. ఉచితం, రూ.100, రూ.300, రూ.500 దర్శనాలు ఉంటాయన్నారు. మూలా నక్షత్రం రోజున ఒక వరుసలో రూ.500 టిక్కెట్టు కొనుగోలు చేసిన వారిని పంపిస్తామని.. .మిగతా అన్ని వరుసలు ఉచితమేనని చెప్పారు. ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం నుంచి నగరోత్సవం నిర్వహిస్తామని... చివరి రోజు సాయంత్రం ఆరు గంటలకు తెప్పోత్సవం జరుగుతుందన్నారు. భక్తులందరికీ కుంకుమ ప్రసాదం ప్యాకెట్ల రూపంలో ఉచితంగా పంపిణీ చేయనున్నామని చెప్పారు.

Indrakeeladri Celebrations ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శాకాంబరిదేవి రూపంలో అమ్మవారు.. పోటెత్తిన భక్తులు..

Dussehra Navaratri celebrations : దసరా రోజుల్లో ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ప్రత్యేక ఖడ్గమాలార్చన కోసం రూ.5,116 రూపాయలు, ప్రత్యేక కుంకుమార్చన రూ. 3000 వేల రూపాయలు, మూలా నక్షత్రం రోజున రూ. 5000 రూపాయలకకు రెండు బ్యాచ్‌లుగా నిర్వహిస్తామని.. శ్రీచక్ర నవార్చన రూ. 3000 రూపాయలు, చండీ హోం రూ. 4000 రూపాయల రుసుముగా ధర నిర్ణయంచినట్లు ఈవో భ్రమరాంబ తెలిపారు. పరోక్ష పూజలకు రుముము 20 వేల రూపాయలుగా ఖరారు చేశారు.

ABOUT THE AUTHOR

...view details