ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోవిడ్ ఒప్పంద వైద్యుల జీతం బకాయిలపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

AP Doctors Pending Salaries: కోవిడ్​ మహామ్మారి సమయంలో సేవలు అందించిన వైద్యులకు ప్రభుత్వం వేతనాలు చెల్లించకపోవటంతో.. హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమకు కోవిడ్​ సమయంలో విధులు నిర్వహించిన వేతానాలు చెల్లించలేదని ఒప్పంద వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు.

High Court
హైకోర్టు

By

Published : Dec 2, 2022, 12:50 PM IST

Pending Salaries To Doctors కొవిడ్‌ సమయంలో సేవలు అందించిన వైద్యులకు జీతం బకాయిలు చెల్లించకపోవడంతో.. రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వివరాలు సమర్పించాలని ప్రభుత్వ న్యాయవాదికి ధర్మాసం ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 20 నుంచి మార్చి 20 వరకు ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా సేవలు అందించిన తమకు జీతం బకాయిలు చెల్లించలేదని.. ఒప్పంద వైద్యులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాది.. పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం లేకుండా పోయిందని ధర్మాసనానికి తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి జీతం ఎందుకు అటాచ్‌ చేయకూడదో చెప్పాలని హైకోర్టు పేర్కొంటూ.. విచారణను ఈనెల ఏడుకు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details