ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిప్యుటేషన్​పై ఐదేళ్లకు పైగా పని చేస్తున్న పోలీసులు బదిలీ

DGP Orders On Deputation Transfers in AP: డిప్యుటేషన్, అటాచ్​మెంట్​లపై ఐదేళ్లకు పైబడి పనిచేస్తున్న పోలీసులను సొంత యూనిట్లకు పంపాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. చాలా చోట్ల ఎస్ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకూ ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నట్లుగా గుర్తించారు.

డిప్యుటేషన్ బదిలీలపై డీజీపీ ఉత్తర్వులు
డిప్యుటేషన్ బదిలీలపై డీజీపీ ఉత్తర్వులు

By

Published : Jan 3, 2023, 5:08 PM IST

DGP Orders On Deputation Transfers In AP: డిప్యుటేషన్, అటాచ్​మెంట్​లపై ఐదేళ్లకు పైబడి పని చేస్తున్న పోలీసులను సొంత యూనిట్లకు పంపాలని డీజీపీ కార్యాలయం ఆదేశించింది. మూడేళ్లకు మించి ఒకేచోట పనిచేసిన వారిని తక్షణమే మాతృ యూనిట్​కు పంపాల్సిందిగా మెమో జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల ఎస్పీలకు, యూనిట్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. చాలా చోట్ల ఎస్ఐల నుంచి కానిస్టేబుళ్ల వరకూ ఏళ్లుగా ఒకే చోట పని చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈ కారణంగా అవినీతి, పక్షపాతం, నేతలతో కుమ్మక్కవ్వటం, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి అంశాలు వెలుగు చూస్తున్నాయని డీజీపీ కార్యాలయం ఆ మెమోలో పేర్కొంది.

ఏపీఎస్​పీ, ఏఆర్, సివిల్ ఇలా అన్ని విభాగాల్లోనూ డిప్యుటేషన్, అటాచ్​మెంట్లపై పని చేస్తున్నవారు ఉన్నట్లు తెలిపింది. ఇలాంటి వ్యవహారాల వల్ల జూనియర్లకు పదోన్నతులు కల్పించటం కష్టతరం అవుతోందని డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details