Couple committed suicide ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలంలోని గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగులో దూకి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మునగపాడు గ్రామానికి చెందిన పణితి తిరుపతిరావు(32)కు విజయవాడకు చెందిన కుసుమ(28)తో ఆరేళ్ల క్రితం వివాహమైంది. తిరుపతిరావు గుంటుపల్లి గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం గొల్లపూడిలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన తిరుపతి రావు, కుసుమలు సాయంత్రం మునగపాడు గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాత్రి ఏడు గంటల సమయంలో గడ్డమణుగు గ్రామ శివారులోని పులివాగు వద్దకు చేరుకున్నారు. ద్విచక్రవాహనాన్ని వంతెనపై ఉంచి భార్యాభర్తలు ఇద్దరూ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Couple suicide వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్న యువ దంపతులు - వాగులో దూకిన దంపతులు
Couple committed suicide వాగులో దూకి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకుంది. శుక్రవారం గొల్లపూడిలోని బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన దంపతులు ఇంటికి తిరిగివస్తూ వాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అసలేం జరిగిందంటే.
వాగులో దూకి దంపతుల ఆత్మహత్య