ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మరో 16 నెలల్లో ఎన్నికలు.. ఎమ్మెల్యే ప్రతి ఇంటికీ వెళ్లాలి: సీఎం జగన్‌ - సీఎం జగన్‌

CM Meeting with NTR District Leaders: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు, నేతలతో భేటీ అయిన సీఎం జగన్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ తమ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకురుతుందనివెల్లడించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే విస్తృతస్థాయిలో పర్యటించాలని వెల్లడించారు.

CM Meeting with NTR District Leaders
CM Meeting with NTR District Leaders

By

Published : Dec 15, 2022, 9:42 PM IST

Updated : Dec 15, 2022, 10:24 PM IST

CM jagan Meeting with NTR District Leaders in AP: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో ముఖ్యమంత్రి జగన్‌ సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమాయత్తంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి కార్యకర్తతోనూ విడిగా మాట్లాడిన జగన్‌.. మైలవరం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన పనులను వివరించారు. మరో 16 నెలల్లో ఎన్నికలు రానున్నాయని సీఎం జగన్‌ తెలిపారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ వెళ్లాలని స్పష్టం చేశారు.

మైలవరం నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సీఎం సమావేశం

జనవరిలో గ్రామాల్లో బూత్‌ కమిటీలు ఏర్పడిన అనంతరం నాయకులు, కార్యకర్తలు... మరింత వేగంగా అడుగులు వేయాలని సీఎం తెలిపారు. మైలవరం నియోజకవర్గంలోని గ్రామాల్లో 89 శాతం ఇళ్లకు ప్రభుత్వ పథకాలు అందుతునట్లు సీఎం వెల్లడించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఈ వివరాలను ప్రజలకు తెలియజెప్పాలని జగన్ సూచించారు.

MLA Vasantha Krishnaprasad: గత ఎన్నికల్లో కంటే అత్యధిక మెజార్టీతో గెలుపొందాలని ముఖ్యమంత్రి జగన్‌ దిశానిర్దేశం చేశారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ తెలిపారు. పార్టీలో ఏవైనా అంతర్గత సమస్యలు ఉంటే కూర్చుని పరిష్కరించుకుందామని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. మైలవరం నుంచి సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం సీఎం జగన్‌దేనని స్పష్టం చేశారు.

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details