CM Jagan Cheated Anganwadi Workers :నాడు ప్రతిపక్షనేతగా జగన్ మోహన్ రెడ్డి అంగన్‌వాడీలకు ఇచ్చిన హామీ! మరి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ హామీని నెరవేర్చకుండా తుంగలో తొక్కారు. తెలంగాణలో 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించనున్నట్లు ప్రకటించారు. తద్వారా వాటిల్లోని అంగన్వాడీ కార్యకర్తలకు వేతనం 5వేల 850 రూపాయల చొప్పున పెరగనుంది.
Anganwadi Workers Protest Against YSRCP Government :మన రాష్ట్రంలో మాత్రం అంగన్వాడీ సిబ్బంది డిమాండ్ల సాధన కోసం రెండేళ్లుగా రోడ్డెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదు. ఓ పక్క అంగన్వాడీలపై తెలంగాణ ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తుంటే మన రాష్ట్రంలో జగన్ సర్కారు దారుణంగా వంచించింది. డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు పోరుబాట పడితే కనీసం వారిని పిలిచి మాట్లాడిన పరిస్థితి లేదు. పైగా మహిళల ధర్నాలు, నిరసనలను ఉక్కుపాదంతో (Iron foot on Anganwadis) అణచి వేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తల ధర్నా.. జగన్ హామీ ఏమైందని ప్రశ్న
తెలంగాణలో పదవీ విరమణ ప్రయోజనాలు :జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యాక అంగన్వాడీల వేతనం వెయ్యి పెంచారు. కొంత కాలానికి సంక్షేమ పథకాల్లో కోత (Welfare Schemes Cut for Anganwadis) పెట్టారు. ఈ నాలుగేళ్లలో తెలంగాణలో అంగన్వాడీ కార్యకర్తలకు మరో 3వేల 150 రూపాయల చొప్పున పెంచినా జగన్ మనసు కరగలేదు. తాజాగా అక్కడి ప్రభుత్వం వారి ఉద్యోగ విరమణ వయసును 65 ఏళ్లకు పెంచింది. ఉద్యోగ విరమణ సమయంలో అంగన్వాడీ కార్యకర్తలకు లక్ష రూపాయలు, ఆయాలకు 50 వేల రూపాయల చొప్పున చెల్లించాలని నిర్ణయించింది.