ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

BJP Leaders Protest on YCP Leaders Comments: వైసీపీ నేతల వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్​.. పలుచోట్ల ఆందోళనలు - విజయవాడలో బీజేపీ ధర్నా 2023

BJP Leaders Protest on YCP Leaders Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పార్టీ నేతలు ఆందోళనలకు దిగారు. పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వం తీరు, సభ్యులపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీని క్షమాపణలు కోరమని డిమాండ్​ చేస్తూ నిరసనలు చేపడుతోన్నారు.

BJP Leaders Protest on YCP Leaders Comments
BJP Leaders Protest on YCP Leaders Comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 12, 2023, 10:07 PM IST

BJP Leaders Protest on YCP Leaders Comments: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలకు పార్టీ నేతలు ఆందోళనలకు దిగారు. విజయవాడ వన్​ టౌన్‌లోని కేబీఎన్​ కాలేజీ సెంటర్​లో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డురి శ్రీరామ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసన చేస్తున్న నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ నేతలు భోగవల్లి శ్రీధర్, నూతలపాటి బాల, మాదాల రమేష్, నరసరాజు, సుమతి తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం బీజేపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పొత్తులపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు... అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాం: పురందేశ్వరి

విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్‌ బాజీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన సాగుతోందని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. పంచాయతీ నిధులు మళ్లింపుపై తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

మద్యంపై సీబీఐ విచారణ కోరితే ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. 2019 నుంచి ఇప్పటిదాకా మద్యంపై డిజిటల్ లావాదేవీల వివరాలను బయటపెట్టగలరా? అని నిలదీశారు. మద్యంపై ఏడాదికి 25 వేల కోట్ల రూపాయలు, నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల నిధులు కాజేశారని ఆరోపించారు. తమ పార్టీ నేతలు కేంద్రానికి మద్యం దుకాణాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీరుతెన్నుల గురించి ఫిర్యాదు చేస్తే వైసీపీ నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవ చేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలకు అనుమతివ్వడం తమ పార్టీ విజయంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల తన పరిధి దాటి మాట్లాడుతున్నారని షేక్​ బాజీ అన్నారు.

కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం: మంత్రి అంబటి రాంబాబు

YCP Vs BJP :నెల్లూరు బీజేపీ కార్యాలయంలో అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్ది సమావేశం నిర్వహించారు. ఆయన వైసీపీ తీరును విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్దిని ప్రభుత్వ సలహాదారుడి కంటే సకల శాఖ మంత్రి అనడం మంచిదని అన్నారు. వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిగిపోతున్నాయని.. ఓటమి భయంతో ప్రజలను, ప్రతిపక్షాలను ఆ పార్టీ ఇబ్బంది పెడుతుందని దుయ్యబట్టారు. పురందీశ్వరిపై గాల్లో తిరిగే సీఎం, సకల శాఖల మంత్రి విమర్శించడం హాస్యాస్పదం అని అన్నారు. వెంటనే సజ్జల బీజేపీకి క్షమాపణలు చెప్పాలని డిమాండు చేశారు. పురందేశ్వరి మొదటి ప్రాధాన్యత పార్టీకి ఇస్తున్నారు. తరువాతే కుటుంబానికి ఇస్తున్నారని పేర్కొన్నారు. బయటకు వచ్చిన ప్రతిపక్షాలను ముఖ్యమంత్రి హౌస్ అరెస్ట్లు చేయిస్తున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకొని పాలన సాగిస్తున్నాడని సీఎం జగన్​ను విమర్శించారు. రాష్ట్రంలో ఐపీసీ కాదు.. వైసిపీ సెక్షన్లు నడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. పోలీసులను అడ్డు పెట్టుకొని ముందుకు సాగుతున్న సీఎం ప్రజాగ్రహాన్ని ఎక్కువ కాలం ఆపలేరని హెచ్చరించారు.

'అంబటి రాంబాబు ఎవరో నాకు తెలీదు.. ఆయనేమన్నా ఆస్కార్ స్థాయి నటుడా..?'

ABOUT THE AUTHOR

...view details