ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"ఆంధ్రప్రదేశ్​లో అరాచకం జరుగుతున్నా ప్రధాని ఎందుకు స్పందించటం లేదు" - ప్రధాని మోది పై అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు

Ayyanna Patrudu: రాష్ట్రంలో అరాచకాలు జరుగుతుంటే ప్రధాని ఎందుకు స్పందిచటం లేదని తెదేపా పోలిట్​ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో భాజపా నిలదీయాలని అన్నారు.

Ayyanna Patrudu
అయ్యన్న పాత్రుడు

By

Published : Oct 29, 2022, 9:56 AM IST

Updated : Oct 29, 2022, 1:14 PM IST

Chintakayala Ayyanna Patrudu : ఆంధ్రప్రదేశ్‌లో అరాచకం జరుగుతున్నా ప్రధాని మోదీ ఎందుకు స్పందించడం లేదని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ప్రశ్నించారు. జగన్‌పై చర్యలు తీసుకునే ధైర్యం మోదీకి లేదా అని నిలదీశారు. భాజపాకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయో జగన్‌ని నిలదీయాలని సూచించారు. బుద్దా వెంకన్న దీక్షకు మద్ధతు తెలిపారు. అమరావతే ఏకైక రాజధానిగా రాష్ట్ర ప్రజలు గుర్తించారని అయ్యన్న అన్నారు. అయితే ఉత్తరాంధ్ర సమస్యలపై తెదేపా పోరుకు విశాఖ వెళ్లేందుకు ప్రయత్నించిన తెలుగుదేశం నేత బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో.. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన విజయవాడలోని ఇంట్లోనే దీక్ష చేపట్టారు.

తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు
Last Updated : Oct 29, 2022, 1:14 PM IST

ABOUT THE AUTHOR

...view details