ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Anna canteen: అన్న క్యాంటిన్‌పై దాడి.. ఖండించిన తెదేపా - ఎన్టీఆర్​ జిల్లాలో అన్న క్యాంటీన్​పై దాడి

Attack on Anna canteen: ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో అన్న క్యాంటిన్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో క్యాంటీన్ ఏర్పాటు చేయగా... రాత్రి దుండగులు అక్కడ ఉన్న ఫ్లెక్సీలు ధ్వంసం చేశారు. బ్యానర్లు అన్నీ చించివేశారు.

Attack on Anna canteen
అన్నా క్యాంటిన్‌పై దాడి

By

Published : Aug 6, 2022, 11:49 AM IST

Updated : Aug 6, 2022, 7:56 PM IST

Attack on Anna canteen: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో.. తెదేపా జాతీయ కోశాధికారి శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్న క్యాంటీన్​పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిన్న రాత్రి దుండగులు అక్కడి ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. తెదేపా నేత చంద్రబాబు, నారా లోకేశ్​, నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య బొమ్మలతో ఉన్న ఫ్లెక్సీలను ఇష్టానుసారంగా చించి వేశారు. ఈ రోజు ఉదయం ఈ విషయాన్ని గమనించిన తెదేపా నాయకులు... ఘటనను తీవ్రంగా ఖండించారు. దీనిపై శ్రీరాం తాతయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు తెలిపారు.

Last Updated : Aug 6, 2022, 7:56 PM IST

ABOUT THE AUTHOR

...view details