Kodi Pandalu : రాష్ట్రంలో కోడిపందాల బరుల ఏర్పాటుకు అడ్డుఅదుపు లేకుండా పోతొంది. కోడి పందాల బరులను ఏర్పాటు చేసేందుకు నిర్వహకులు.. ఆదేశాలను, నిషేదాలను అసలు పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ కార్యాలయాల పక్కన, పశువుల సంతలో, మామిడితోటలో ఇలా ఎక్కడ పడితే అక్కడ బరులను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆదేశాలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న బరులను అధికారులు తొలగిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యకాలపాలకు పాల్పడితే ఉపేక్షించేదే లేదని ఆధికారులు హెచ్చరిస్తున్నారు.
జిల్లాలోని తిరువూరులో ఆర్డీవో కార్యాలయం పక్కనే కోడి పందేల కోసం బరులను ఏర్పాటు చేశారు. కార్యాలయం పక్కనే ఉన్న మామిడి తోటలో పందేలకు బరులను సిద్ధం చేశారు. అధికారులు బరుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేస్తున్న నిర్వహకులు పట్టించుకోవటం లేదు. అలాగే పశువుల సంత సమీపంలోని మామిడితోటలో మరో బరి సిద్ధం చేశారు.