- కర్నూలులో విషాదం.. బాణసంచా పేలి బాలుడు మృతి
Boy Died in Crackers Blast: కర్నూలు నగరంలోని సీతారాం నగర్లో విషాదం చోటు చేసుకుంది.. ఓ ఇంట్లో నిల్వ చేసిన బాణసంచా పేలి బాలుడు మృతి చెందాడు. మరో బాలుడికి గాయాలయ్యాయి. ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చొద్దు: పవన్
Pawan Kalyan Comments on Universities: సీఎం జగన్ జన్మదిన వేడుకలకు విశ్వవిద్యాలయాల్లో ప్లెక్సీలు కట్టి వేడుకలు నిర్వహించటంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. విశ్వ విద్యాలయాలు విద్యార్థులను సామాజిక, రాజకీయ, ప్రాపంచిక విషయాలపై చైతన్యవంతులను చేయాలని జనసేనపార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోని ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు ఆ బాధ్యతను విస్మరించి వర్సిటీలను అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చేశారన్నారు.
- పారుమంచాలలో ముగిసిన తితిదే ఈవో కుమారుడి అంత్యక్రియలు
Funeral of TTD EO son has ended: గత ఆదివారం గుండెపోటుకు గురై చికిత్స పొందుతూ కన్నుమూసిన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళిరెడ్డి అంత్యక్రియలు స్వగ్రామంలో ముగిశాయి. సీఎం జగన్.. ధర్మారెడ్డి కుటుంబ సభ్యలును పరామర్శించారు. అంత్యక్రియల్లో వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, టీటీడీ దేవస్థానం ఉద్యోగులు, టీటీడీ చైర్మన్ బంధువులు పాల్గొన్నారు.
- పార్లమెంట్ సభ్యుల కోసం ‘ఖుదీరామ్ బోస్’ ప్రత్యేక ప్రదర్శన
Khudiram Bose Movie Special Show : పార్లమెంట్ సభ్యుల కోసం నేడు ఖుదీరామ్ బోస్ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ప్రదర్శితమైంది.
- వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుందని ప్రియురాలి హత్య.. ఆపై విషం తాగిన యువకుడు
తాను ప్రేమించిన యువతి వేరే వ్యక్తిని పెళ్లిచేసుకుందన్న కోపంతో ఓ యువకుడు ఆమెను హత్య చేశాడు. అనంతరం నిందితుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణమైన ఘటన కర్ణాటక దావణగెరెలో జరిగింది.
- భారత్- చైనా 17వ విడత చర్చలు.. సరిహద్దు సమస్యకు త్వరలోనే పరిష్కారం!
తూర్పు లద్ధాఖ్‌లో భద్రతను, స్థిరత్వాన్ని కొనసాగించాలని భారత్, చైనా సైన్యాలు నిర్ణయించాయి. వాస్తవాధీన రేఖ వెంబడి మిగిలిన సమస్యల పరిష్కారానికి ఈనెల 20న చర్చలు జరిపిన ఇరు సైన్యాలు.. పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నాయి. తవాంగ్ సెక్టార్ తాజా ఘర్షణ నేపథ్యంలో జరిగిన ఈ చర్చలు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిశాయి.
- 'కొవిడ్ పేరుతో యాత్రను ఆపేందుకు ప్లాన్'.. కేంద్రంపై రాహుల్ ఫైర్!
కొవిడ్ దృష్ట్యా భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి రాసిన లేఖపై రాహుల్ గాంధీ స్పందించారు. ఇదంతా యాత్రను ఆపేందుకు భాజపా వేస్తున్న ప్లాన్ అని ఆయన ఆరోపించారు. మరోవైపు ఈ విషయమై కొంతమంది కాంగ్రెస్ నేతలు సైతం స్పందించారు.
- ఈ ఏడాదే ఉద్యోగంలో చేరారా? పన్ను మాటేంటి?
పరిమితికి మించిన ఆదాయం ఉన్నప్పుడు పన్ను తప్పనిసరిగా చెల్లించాలి. అయితే ఈ పన్నులను భారం తగ్గించుకోవాలంటే ఆదా చేసే పెట్టుబడులను ఎంచుకోవాలి. పన్ను రిటర్నులు దాఖలు చేయడంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. మరి అవేంటో తెలుసుకుందాం రండి..
- IND VS BAN: తొలి రోజు భారత్‌దే.. విజృంభించిన అశ్విన్, ఉమేశ్
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. ఈ ఆట పూర్తయ్యేసరికి టీమ్ఇండియాకే ఆధిపత్యం దక్కింది.
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు టీమ్ఇండియాకే ఆధిపత్యం దక్కింది. సీనియర్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్ అదరగొట్టేశారు. దీంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది.
- RRR Oscar: 100 సిగ్నేచర్ స్టెప్పులతో 'నాటునాటు'.. 0.5Xతో చూసినా స్పీడ్‌గా.. రికార్డుల మోత
'ఆర్ఆర్ఆర్'లోని నాటు నాటు సాంగ్ తాజాగా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ సందర్భంగా ఈ పాట గురించి ఆసక్తికర విషయాలను నెమరువేసుకుందాం..