- ఎస్ఐపీబీ సహా పలు ఆంశాలకు కేబినెట్ ఆమోదం..!
AP Cabinet Meeting : ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రమోషన్ పాలసీ, భూముల రీసర్వే కోసం మున్సీపాలిటీల చట్ట సవరణ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తస్మాత్ జాగ్రత్త.. ఓడీ విషయంలో రాష్ట్రాన్ని హెచ్చరించిన ఆర్‌బీఐ
RBI WARNED STATE: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. రిజర్వ్ బ్యాంక్ కల్పించే అన్ని రకాల ఆర్థిక వెసులుబాట్లను రాష్ట్రం ఇప్పటికే వినియోగించేసుకుంది. లెక్కకు మిక్కిలి అప్పులు చేయడంతో సెక్యూరిటీ వేలంలోనూ పాల్గొనలేని పరిస్థితి. మొన్నటి వరకు అప్పు చేసి రోజులు నెట్టుకొచ్చారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇవి పాటిస్తే ..... ఇక భయం ఉండదు
Ways to let go of fear : కొంతమంది విద్యార్థులు చదువంటే భయపడుతుంటారు. కాలేజీకి వెళ్లాలన్నా, తరగతుల్లో కూర్చోవాలన్నా, పరీక్షలన్నా తెలియని ఆందోళన వారిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అప్పుడే కొత్త ఊరికి మారినవారు, అప్పటివరకూ ఒకచోట చదివి పెద్ద విద్యాసంస్థలకు వెళ్లినవారు, సబ్జెక్టు అంటే భయం ఉన్నవారిలో ఇటువంటి భావన సహజం. అయితే కాస్త ప్రయత్నిస్తే... దీన్ని అధిగమించడం పెద్ద విషయమేమీ కాదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కౌన్ బనేగా కరోడ్‌పతి పేరుతో మెస్సేజ్...ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ
Kaun Banega Crorepati fraud in Hyderabad: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతూనే ఉన్నారు. ఇదివరకు ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపి డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పుట్టినరోజునే శరద్ పవార్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్.. నిందితుడు అరెస్ట్
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన ఇంటికి ఓ గుర్తు తెలియని వ్యక్తి పదే పదే కాల్స్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయన్ను హత్య చేస్తామంటూ దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. సోమవారం శరద్ పవార్ పుట్టినరోజు కాగా.. అదేరోజు ఈ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాడ్డుతో కొట్టి తండ్రి దారుణ హత్య.. శరీరాన్ని 30 ముక్కలు చేసి.. బోరుబావిలో..
తాగొచ్చి గొడవ పడుతున్న తండ్రిని రాడ్డుతో కొట్టి హత్య చేశాడు ఓ వ్యక్తి. శరీరాన్ని 30 ముక్కలు చేసి బోరుబావిలో పడేశాడు. కర్ణాటకలో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెళ్లికి అతిథులుగా ఎద్దులు.. స్పెషల్‌గా స్టేజీ ఏర్పాటు.. ప్రేమను చాటుకున్న రైతు
ఎద్దులపై తనకున్న ప్రేమను వినూత్నంగా చూపించాడు ఓ వ్యక్తి. తన పెళ్లి జరిగే హాల్‌కు తీసుకురావడమే కాకుండా.. వాటికోసం ప్రత్యేకంగా ఒక స్టేజ్‌ను ఏర్పాటు చేశాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మెస్సి రిటైర్మెంట్ అంటూ ప్రచారం.. ఈ సారి ప్రపంచకప్ గెలుస్తాడా?
సాకర్ స్టార్ లియెనల్ మెస్సీ రిటైర్మెంట్ ప్రకటించవచ్చు అని ప్రచారం సాగుతోంది. మరి అతడు ఈ సారి ప్రపంచకప్ సాధిస్తాడా?
సాకర్ స్టార్ లియెనల్ మెస్సీకి ఇదే చివరి ప్రపంచకప్ అని భారీగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు అతడు కూడా ఈ ప్రపంచకప్‌లో విశ్వరూపం చూపిస్తున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అవతార్ 2' కోసం పనిచేసిన అవసరాల శ్రీనివాస్!
'అవతార్ 2' తెలుగు వెర్షన్ కోసం స్టార్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అవసరాల శ్రీనివాస్ పనిచేశారని తెలిసింది. ఆ వివరాలు..జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి అవతార్. ఈ సినిమా సీక్వెల్‌గా అవతార్-2 ది వే ఆఫ్ వాటర్ తెరకెక్కిన విషయం తెలిసిందే. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సీక్వెల్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.