Cooperative Bank Association meeting: సహకార బ్యాంకులు, వ్యవస్థలపై పన్ను వసూలు చేయడాన్ని వెంటనే నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. కో ఆపరేటివ్ బ్యాంకుల నుంచి రెండు శాతం పన్ను చెల్లించాలనే నిబంధనను అమలు చేయడం సరికాదని.. దీనివల్ల కో ఆపరేటివ్ వ్యవస్థలు నష్టాల్లో కూరుకుపోయి.. కుప్పకూలే ప్రమాదం ఉందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(AIBEA) జాతీయ కార్యదర్శి బిఎస్ రాంబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని.. సహకార బ్యాంకులపై పన్నులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ విస్తృత సమావేశం విజయవాడలో జరిగింది. జిల్లా సహకార బ్యాంకుల్లో పని చేసే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(AIBEA) అనుబంధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలపై పోరాట కార్యాచరణపై చర్చించారు. కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటోన్న సమస్యల పరిష్కారానికి పోరాట బాట పట్టాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు అంచెల విధానం అమలు చేయాలని అసోషియేషన్ డిమాండ్ చేసింది.
డీసీబీ బ్యాంకులను ఆప్కాబ్ బ్రాంచిలుగా మార్చి రైతులకు వడ్డీలపై రాయితీ ఇవ్వాలని రాంబాబు డిమాండ్ చేశారు. కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు రాష్ట్ర ప్రభుత్వం వర్తింప జేయాలని సమావేశంలో నేతలు డిమాండ్ చేశారు. కో ఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని.. వారు ఎదుర్కొంటోన్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో సమస్యల పరుష్కారం కోసం త్వరలో ఆందోళన పడతామని స్పష్టం చేశారు.
ఇన్‌కమ్‌టాక్స్ యాక్ట్ 194 ఎన్ అనే సెక్షన్ ప్రకారం కోపరేటివ్ సంఘాల్లో.. రెండు కోట్లకు పైన జరిగే నగదు ట్రాన్సాక్షన్ మీద దాదాపు రెండు శాతం ట్యాక్స్‌ను చెల్లించాలి అనే నియమం ఏదైతే ఉందో అది కనుక అమలు జరిగితే రాష్ట్రంలో ఉండే సంఘాలు అన్నీ కూడా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాం అయినా సరే మొండి పట్టుదలతో ఈ 194 ఎన్ అనే సెక్షన్ ప్రకారం వాళ్లు ట్యాక్స్ వసూలు చెయడానికే చూస్తున్నారు. దాని వల్ల కోపరేటివ్ అంతా కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి.. కేంద్ర ప్రభుత్వాన్ని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని మేమి అడిగేది ఒక్కటే రైతులకు ప్రత్యక్షంగా సహాయపడే విధంగా ఉన్న ఇండస్ట్రీ నుంచి ఇలా ట్యాక్స్ చెల్లింపు నుంచి మినహాయింపు కోరుతున్నాం.- బీఎస్ రాంబాబు, ఎఐబీఈఏ జాతీయ కార్యదర్శి
ఇవీ చదవండి: