ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

YCP vs All Parties: విద్యుత్ ఛార్జీల పెంపుపై అఖిలపక్షాలు ఆగ్రహం.. ఉద్యమానికి శ్రీకారం

All parties fire on YSR Congress party: వైసీపీ ప్రభుత్వంపై అఖిలపక్షాలు మరోసారి భగ్గుమన్నాయి. ప్రజల పట్ల, విద్యుత్ ఛార్జీల పట్ల, వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పట్ల జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ.. ఉద్యమానికి సిద్దమైయ్యాయి. ఈనెల 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ప్రకటించాయి.

All Parties
All Parties

By

Published : Jun 15, 2023, 7:20 PM IST

All parties fire on YSR Congress party: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజల పట్ల, విద్యుత్ ఛార్జీల పట్ల, వ్యవసాయ మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు పట్ల అనుసరిస్తున్న విధానంపై అఖిలపక్షాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు.. అస్మదీయుల కంపెనీలు బాగుండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం.. ప్రజలపై పెనుభారాన్ని మోపుతుందంటూ.. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఈరోజు విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో సమావేశమైయ్యాయి. ఈనెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయడానికి అఖిలపక్షాలు సిద్దమైయ్యాయి.

కరెంట్ ఛార్జీల పెంపుపై అఖిలపక్షాల సమావేశం.. పెంచిన విద్యుత్ ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. విజయవాడలోని దాసరి భవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష నాయకులు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో భాగంగా వైసీపీ తీసుకొచ్చిన ట్రూఅప్ ఛార్జీలు, పెంచిన కరెంట్ ఛార్జీలు, మోటర్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం పెరిగిన విద్యుత్ ఛార్జీల ముందు వడదెబ్బ కూడా ఓడిపోయిందని అఖిలపక్షం నాయకులు ఎద్దేవా చేశారు. వైసీపీ తీసుకొచ్చిన ట్రూఅప్ ఛార్జీలను గతంలో ఎప్పుడూ వినలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సన్నిహితులకు లాభం చేకూర్చేందుకే స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఈనెల 20నుంచి ఉద్యమానికి శ్రీకారం.. అఖిలపక్షాల నాయకులు మాట్లాడుతూ.. విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఈ నెల 20వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. ఎప్పుడో వాడుకున్న విద్యుత్ ఛార్జీలకు.. జగన్ ప్రభుత్వం ఇప్పుడు బిల్లులు వసూలు చేయడం సిగ్గచేటని అఖిలపక్ష నాయకులు విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ తనకు కావాల్సిన వారికి ఆర్థికంగా దోచుపెట్టడానికే విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశం తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు.

ఈనెల 18 నుంచి సమావేశాలు, సదస్సులు..అనంతరం ఈనెల 18వ తేదీన వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నామని.. అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆ తర్వాత 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలకు వ్యతిరేకంగా సదస్సులు, సెమినార్లు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన స్పందన రాకపోతే.. ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద ఆందోళనలు చేపడతామన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కాగానే.. సాంకేతిక కారణాలతో కొంత సమయం విద్యుత్ అంతరాయం కలిగిందన్న నేతలు.. సెల్‌ఫోన్ల వెలుతుర్లో సమావేశాన్ని కొనసాగించామన్నారు.

విద్యుత్ ఛార్జీల పెంపుపై అఖిలపక్షాలు ఆగ్రహం.. ఉద్యమానికి శ్రీకారం

''ముఖ్యమంత్రి జగన్..ఆయన అనుచరులు (అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ) న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల విధానం తీసుకొస్తున్నారు. షిర్డీసాయి కంపెనీకి ఆర్థికంగా లాభం చేకూర్చడానికి వైసీపీ ప్రభుత్వం పని చేస్తోంది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం ఏది ఆదేశిస్తే..ముఖ్యమంత్రి జగన్ అన్ని రాష్ట్రాల కంటే ముందే ఏపీలో దానిని అమలు చేస్తున్నారు. విద్యుత్ ప్రయివేటీకరణకు పెద్దపీఠ వేయడం వల్లే ఈరోజు విద్యుత్ ఛార్జీలు అధిక మొత్తంలో పెంచాల్సి వచ్చింది. ఏసీ, కూలర్ వంటిని వినియోగిస్తున్న వారి నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎప్పుడో వాడుకున్న విద్యుత్‌కి ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయడమేంటి..?, విద్యుత్ సర్దుబాటు, ట్రూఅప్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి. లేకపోతే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతాం.''- అఖిలపక్ష నాయకులు

ABOUT THE AUTHOR

...view details