ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామంటే నమ్మొద్దు: హైకోర్టు రిజిస్ట్రార్​

AP HIGH COURT: హైకోర్టు పేరుతో ఆన్​లైన్​లో చాలామణి అవుతున్న సర్క్యులర్​, అపాయింట్​మెంట్​ లెటర్​ గుర్తించినట్లు హైకోర్టు రిజిస్టార్​ ఆలపర్తి గిరిధర్ తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నిరుద్యోగులు ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

AP HIGH COURT
హైకోర్టు

By

Published : Nov 15, 2022, 9:10 PM IST

AP HIGH COURT: హైకోర్టు పేరుతో ఓ కల్పిత సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్ గుర్తించామని హైకోర్టు రిజిస్ట్రార్ ఆలపర్తి గిరిధర్ తెలిపారు. దీనిపై రిజిస్ట్రార్​ సంతకం ఫోర్జరీ చేసినట్లు గుర్తించినట్లు ఆయన తెలిపారు. వాస్తవానికి అలాంటి సర్క్యులర్, అపాయింట్‌మెంట్ లెటర్​ని హైకోర్టు జారీ చేయలేదని వెల్లడించారు. ఈ కల్పిత సర్క్యులర్​పై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసగాళ్లు చెప్పే మాటలను నమ్మవద్దని ఆయన సూచించారు.

అభ్యర్థులను ప్రభావితం చేసేలా.. రిక్రూట్​మెంట్ ప్రక్రియపై వ్యాఖ్యలు చేయటం, పేర్లను ప్రస్తావించి డబ్బులు చెల్లించాలని కోరే వారిపై విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించిందన్నారు. మోసగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించిందన్నారు. ఏదైనా తప్పుడు వార్తలు, సమాచారం పోస్ట్ చేయడం, ప్రచారం చేసే వారిపై ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉంటుందని స్పష్టం చేసిందన్నారు. అభ్యర్థులు రిక్రూట్‌మెంట్, నోటిఫికేషన్, పరీక్ష తేదీ-స్థలం, మార్కుల జాబితా, ప్రొవిజనల్ తదితర వివరాలకై హైకోర్టు అధికారిక వెబ్​సైట్ https://hc.ap.nic.in ను సందర్శించాలని హైకోర్టు సూచించిందన్నారు. నకిలీ రిక్రూట్​మెంట్, నకిలీ లెటర్‌లపై సమాచారం అందితే హైకోర్టుకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్​ కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details