Akhilapaksha angry with GO No.1: ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్-1ను ప్రవేశపెట్టిందని.. తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈరోజు అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ' ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. అసెంబ్లీ ముట్టడికి రాష్ట్ర నలుమూలల నుంచి బయలుదేరిన సీపీఐ నేతలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అంతేకాకుండా, 151 సీఆర్సీపీ నోటీసు ఇచ్చిన పోలీసులు.. ఆదివారం రాత్రి నుంచే పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలో జీవో నెంబర్-1 రద్దు చేయాలంటూ..ఈరోజు అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ'పై పోలీసులు ఉక్కుపాదం మోపారు.
వివరాల్లోకి వెళ్తే.. జీవో నెంబర్-1 రద్దు చేయాలంటూ.. అఖిలపక్షాలు చేపట్టిన 'చలో అసెంబ్లీ'పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు చేశారు. శాసన సభకు వెళ్తున్న సీపీఐ నేతలను, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పౌర హక్కుల్ని ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు మండిపడ్డారు.
ఈ క్రమంలో జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా అఖిలపక్షాలు చలో అసెంబ్లీకి పిలుపునివ్వడంతో.. పోలీసుల ఆంక్షల పేరిట నేతలను నిర్బంధించారు. ఎక్కడికక్కడ విస్తృత తనిఖీలు చేపట్టారు. శాసనసభకు వెళ్తున్న సీపీఐ నేతలు, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి నేతలను గుంటూరు జిల్లా మందడం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. నేతలు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.