ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలం ఆలయం దగ్గర సెక్యూరిటీ గార్డ్​పై యువకుడు దాడి.. ఎందుకంటే..! - youngman attack on a security guard in srisailam

Assault on security guard : శ్రీశైలం దేవస్థానం దగ్గర ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనతో పాటు వచ్చిన వారిని దర్శనానికి పంపలేదని.. ఆర్జిత సేవల క్యూ లైన్ వద్ద విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్​పై పిడిగుద్దులతో దాడి చేశారు. ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సెక్యూరిటీ గార్డుపై దాడి
సెక్యూరిటీ గార్డుపై దాడి

By

Published : Nov 14, 2022, 3:49 PM IST

Updated : Nov 14, 2022, 7:54 PM IST

Assault on security guard: శ్రీశైలంలోని ఆలయ క్యూ లైన్ వద్ద సెక్యూరిటీ గార్డ్​పై దాడి జరిగింది. ఆర్జిత సేవల క్యూ లైన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఒక సెక్యూరిటీ గార్డ్​పై స్థానిక యువకుడు చితకబాదాడు. తన వెంట వచ్చిన వారిని దర్శనానికి పంపించలేదని.. యువకుడు సెక్యూరిటీ గార్డ్​పై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న దేవస్థానం వీఆర్వో శ్రీనివాసరావు, మరో సెక్యూరిటీ గార్డు విడిపించే ప్రయత్నం చేసినా.. వారిద్దరూ బాహాబాహికి దిగారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని.. క్యూలైన్ల వద్ద సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని దేవస్థానం ఈవో లవన్న తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

ఈవో ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డ్​పై స్థానిక యువకుడు చేసిన దాడి చర్చనీయాంశంగా మారింది. విధుల్లో ఉన్న సెక్యూరిటీ గార్డ్​పై దాడి చేయడం పట్ల దేవస్థానం అధికారులు తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో గాయపడ్డ సెక్యూరిటీ గార్డ్​ను దేవస్థానం ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.

సెక్యూరిటీ గార్డ్​పై యువకుడు దాడి

ఇవీ చదవండి :

Last Updated : Nov 14, 2022, 7:54 PM IST

ABOUT THE AUTHOR

...view details