Cheater Mahendra Babu: ముగ్గురు యువతులను పెళ్లి చేసుకుని ఓ యువకుడు మోసగించిన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం చాకరాజువేముల గ్రామానికి చెందిన మహేంద్రబాబుకు మార్కాపురానికి చెందిన ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ విషయం దాచిపెట్టి తన గ్రామానికే చెందిన మరో మహిళను ప్రేమించి నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఆత్మహత్య చేసుకుంటే ఆమెకు సంబంధించిన బీమా డబ్బులు వస్తాయని తల్లి వద్ద ప్రస్తావించాడు.
ఆత్మహత్య చేసుకో.. బీమా వస్తుంది: భార్యను వేధించిన భర్త - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
Cheater Mahendra Babu: తనకు పెళ్లి కాలేదంటూ నమ్మించి.. ఓ వ్యక్తి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. మూడో పెళ్లి విషయం తెలిసుకున్న రెండో భార్య అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు.
ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని భార్యను బలవంతం చేసేవాడు. భరించలేక ఆమె హైదరాబాద్‌కు వెళ్లిపోయింది. మూడేళ్ల తర్వాత కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామానికి చెందిన మరో మహిళతో మహేంద్రబాబు పరిచయం పెంచుకున్నాడు. తనకు పెళ్లి కాలేదని నమ్మించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె నుంచి రూ.5 లక్షలు, ఆమె తల్లి చరవాణి ద్వారా ప్రైవేటు లోన్ యాప్ నుంచి రూ.5 లక్షలు రుణం తీసుకున్నాడు. మూడో పెళ్లి విషయం తెలిసిన రెండో భార్య అతనిపై, అతని తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపాలు గురువారం తెలిపారు.
ఇవీ చదవండి: