Kurnool Crime News: కర్నూలు వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకుడు మీసాల విజయ్ కుమార్‌పై.. గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడిచేశారు. నగరంలోని మద్దూర్ నగర్లో ఉన్న విజయ్ కుమార్.. గొంతుకోసి నిందితులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్‌ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
కర్నూలులో వైకాపా నాయకుడిపై.. వేటకొడవళ్లతో దాడి..! - kurnool crime news
Attack on YSRCP Leader at Kurnool: కర్నూలు పట్టణం మద్దూర్ నగర్లో వైకాపా ట్రేడ్ యూనియన్ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు.
Attack on YSRCP Leader at Kurnool