ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఐతో వివాదం దురదృష్టకరం: హాబీబుల్లా

పోలీసులు అంటే గౌరవం ఉందని.. తనకు, సీఐకు జరిగిన వివాదం దురదృష్టకరమని వైకాపా మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకుడు డి.ఎస్. హాబీబుల్లా నంద్యాలలో అన్నారు.

Hobibullah press confrence in Nandyal.
సీఐను కలిసిన హాబీబుల్లా

By

Published : Sep 22, 2020, 8:16 AM IST

కర్నూలు జిల్లా నంద్యాలలో ఒకటో పట్టణ పోలీసు స్టేషన్ సీఐకి, వైకాపా మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకుడు హాబీబుల్లాకు మధ్య జరిగిన వివాదానికి తెర పడింది. స్టేషన్​కు వెళ్లి సీఐని ఆయన కలిశారు. తనకు, సీఐకు మధ్య జరిగిన వివాదం దురదృష్టకర సంఘటనగా హబీబుల్లా చెప్పారు.

పోలీసుల అంటే ముఖ్యమంత్రి నుంచి కార్యకర్త వరకు గౌరవం ఉందన్నారు. ఈ వివాదం.. బాధాకరమని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నారు. పోలీసులు బాధపడి ఉంటే పార్టీ తరఫున క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details