ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డబ్బు వెదజల్లిన ఘటనలో వైకాపా నేతలపై కేసు - వైకాపా కార్యకర్తలు

ఆళ్లగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు డబ్బులు వెదజల్లిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

డబ్బులు వెదజల్లిన ఘటనలో వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు

By

Published : Apr 4, 2019, 6:22 PM IST

డబ్బులు వెదజల్లిన ఘటనలో వైకాపా కార్యకర్తలపై కేసు నమోదు
కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం శిరివెళ్ళ మండల కేంద్రంలో వైకాపా కార్యకర్తలు డబ్బులు చల్లిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 1న బలిజపేటలో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రతిపక్షకార్యకర్తలు డబ్బు చల్లారంటూ యూనిస్ బాషా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. అన్వర్ బాషా, సలాం అనే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details