తెదేపా నేత శివనారాయణరెడ్డిపై వైకాపా శ్రేణుల దాడి - ycp
తెదేపా నాయకుడు శివనారాయణరెడ్డిపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్రగాయాలైన శివనారాయణరెడ్డిని ఆస్పత్రికి తరలించారు.
tdp
కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ఇటిక్యాలలో... తెలుగుదేశం నాయకుడు శివనారాయణరెడ్డిపై అదే గ్రామానికి చెందిన వైకాపా కార్యకర్తలు దాడి చేశారు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న శివనారాయణరెడ్డిపై కర్రలు, నాపరాళ్లతో దాడికి పాల్పడ్డారు. బాధితుడికి తీవ్రగాయాలు కాగా... బనగానపల్లె ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఎలాంటి ప్రతీకార దాడులు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.