తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు - womens
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. 15 రోజులుగా కుళాయిలు నీళ్లు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్నూలు జిల్లా కోడుమూరు వాసులు.
తాగునీటి కోసం కర్నూలు జిల్లా కోడుమూరులో ప్రజలు రోడ్డెక్కారు. 15 రోజులుగా కుళాయిలకు నీళ్లు రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోడుమూరు అభివృద్ధి కమిటీ అఖిలపక్ష ఆధ్వర్యంలో మహిళలు...... ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. ఏళ్లుగా తాగునీటి కోసం పోరాటాలు చేస్తున్నా.. తమను ఆదుకునే నాథుడు లేరంటూ బాధితులు వాపోయారు. పక్కనే తుంగభద్ర ఎల్.ఎల్.సీ కాలువ నుంచి నీరు పోతున్నా... తాగేందుకు నీరు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించకుంటే... ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మహిళల ఆందోళన నేపథ్యంలో రహదారిపై వాహనాలు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగింది.