కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రేగులపాడు గ్రామనికి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పొలం తగాదా విషయంలో ఇరువర్గాలు ఘర్షణ పడగా కృష్ణగిరి ఎస్.ఐ ఏకపక్షంగా ఒక వర్గం వారి పక్షాన నిలుస్తున్నారని మనస్తాపంతో సుబ్బరత్నమ్మ అనే మహిళ పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకోవాలని కోరినందుకు తన భార్యను ఎస్.ఐ కించపరిచేలా వ్యవహరించారని బాధితురాలి భర్త ఆరోపించారు.
పోలీసుల తీరుతో.. మహిళ ఆత్మహత్యాయత్నం - women suicide attempt on police behaviour
పొలం తగాదాలో పోలీసులు ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారనే మనస్తాపంతో మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.
పోలీసుల తీరుతో మనస్తాపం చెంది మహిళ ఆత్మహత్యాయత్నం