కర్నూలులోని కృష్ణానగర్‌లో వివాహిత తేజస్వి ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. భర్త మహేష్ వేధింపులు భరించలేకే ప్రాణాలు తీసుకుందని కుటుంబీకులు ఆరోపించారు. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న మహేష్, తేజస్విలు బెంగళూరులో నివాసం ఉన్నారు. పెళ్లికి ముందే మహేష్‌కు అక్రమ సంబంధాలు ఉన్నట్టు తెలిసిందని మృతురాలి తల్లి చెప్పారు. ఈ విషయాన్ని.. అద్దెకు ఉంటున్న ఇంటి యజమానే చెప్పినట్లు ఆమె తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.