ఎనిమిదేళ్ల కిందట ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు. అన్యోన్యంగా ఉన్నవాళ్లకి ఒసారి గొడవొచ్చింది. ఆ గొడవ కాస్తా పెద్దదై పోలీసు స్టేషన్ దాకా వెళ్లింది. తర్వాత విభేదాలు ఎక్కువై... ఇప్పడు ప్రాణాలు పోయే స్థితి దాకా వచ్చింది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు.
భార్యాభర్తల మధ్య గొడవ... ఇద్దరికి తీవ్రగాయాలు - wife and husband fighting in allagadda
వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరికొకరం తోడుండాలంటూ ప్రమాణాలు ఇచ్చుకున్నారు. కొన్నాళ్లకు ఏమైందో ఏమో... మనస్పర్థలతో పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కారు. తరుచూ గొడవవుతుండేది వారి ఇంట్లో. ఇప్పుడిది చిలికిచిలికి గాలివానై... ఒకరినొకరు కొట్టుకున్నారు. చివరికి ఆసుపత్రి మెట్లు ఎక్కి విషమ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.
పట్టణానికి చెందిన కిరణ్, సుబ్బమ్మ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అవి కాస్తా ముదిరి పలుమార్లు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాయి. వాగ్వాదాలతోనే రోజులు గడుస్తుండగా... శుక్రవారం మళ్లీ గొడవ పెట్టుకుని కొట్టుకున్నారు. భర్త భార్యపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. భర్త కూడా తీవ్రగాయాల పాలయ్యాడు. ఇద్దరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై పట్టణ ఎస్ఐ రామిరెడ్డి విచారణ ప్రారంభించారు.
ఇదీచూడండి.ఈ బుడ్డోడు మహా మేధావి..!