భార్య మృతిని తట్టుకోలేక......గంట వ్యవధిలోనే భర్త కూడా మరణించాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆదోనిలోని ఇందిరానగర్‌లో గురువారం జరిగింది. కాలనీలో నివాసముంటున్న శ్యామల అనే మహిళ గురువారం గుండెపోటుతో చనిపోయింది. ఆమె మృతిని జీర్ణించుకోలేక భర్త శ్యామ్ కూడా మరణించాడు. భార్యాభర్తల మృతితో బంధువులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. కాలనీలో విషాదఛాయలు అలముకున్నాయి.
గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి - అదోనిలో భార్యాభర్తలు మృతి వార్తలు
కర్నూలు జిల్లా ఆదోనిలో విషాద ఘటన జరిగింది. అనారోగ్యంతో మహిళ మృతి చెందగా... గంట వ్యవధిలోనే ఆమె భర్త కూడా కన్నుమూశాడు.
wife and husband died with in one hour gap in adoni