కర్నూలులో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 8 అగ్నిమాపక వాహనాలను ప్రారంభించారు. వచ్చే సంవత్సరం నుంచి 4 విడతల్లో పొదుపు మహిళల రుణాలను మాఫీ చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. వీటి విలువ.. రూ.27 వేల కోట్లుగా చెప్పారు. ఏటా పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలిస్తామన్నారు.
4 విడతల్లో పొదుపు మహిళల రుణాలు మాఫీ: బుగ్గన - buggana
నవరత్నాల్లో భాగంగా ఇచ్చిన డ్వాక్రా రుణాల మాఫీ హామీని.. నాలుగు విడతల్లో అమలు చేస్తామని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.
అగ్నిమాపక వాహనాలను ప్రారంభించిన బుగ్గన