శ్రీశైలం జలాశయానికి భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు క్రస్ట్ గేట్లలో... 10 గేట్లను 20 అడుగులు ఎత్తి.. నీటి విడుదలను ఉన్నతాధికారులు కొనసాగిస్తున్నారు. డ్యామ్ ఇన్‌ఫ్లో 5,59,057 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ఫ్లో 5,34,189 క్యూసెక్కులుగా ఉంది.
రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 883.50 అడుగుల మేర నీరుంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 207.4103 టీఎంసీల వద్ద ఉంది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.