కర్నూలు జిల్లా నంద్యాలలోని తితిదే కల్యాణ మండపం ఆవరణలో నీరు చేరి సమస్యగా మారింది. మండపం వెనుక భాగాన ఉన్న మురుగుకాలువ ఉద్ధృతంగా ప్రవహించటంతో... ఆ నీరు వచ్చి అక్కడికి చేరింది. ఎగువన ఉన్న చెరువు నీరు, పట్టణంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగు నీరు ఈ కాలువలో చేరుతోంది. కాలువలో చెత్తా చెదారం అడ్డుపడ్డగానే నీరు, ఇక్కడకు చేరి ఇబ్బంది కలిగిస్తోంది. కాలువ ఆక్రమణకు గురవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
తితిదే కల్యాణ మండపం ఆవరణలో మురుగు నీరు - nandyala ttd kalyanamandapam latest
వాన కురువ లేదు..వరద రాలేదు కానీ చెరువును తలపిస్తోంది. అక్కడ ఒకసారి నీరు చేరితే.. ఎటూ వెళ్లకుండా అక్కడే నిలిచిపోతాయి. సూర్యుడి ప్రతాపానికి అవి ఆవిరి కావాల్సిందే తప్పా మరో మార్గం లేదు.
టీటీడీ కల్యాణ మండపం ఆవరణలో మురుగు నీరు
వర్షాకాలంలో ఈ కల్యాణ మండపం ఆవరణలో నీరు చెరువును తలపిస్తోంది. ప్రస్తుతం ఎలాంటి వానలు లేకున్నా కాలువ కారణంగా నీరు చేరుతోంది. తితిదే అధికారులు స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండీ...విజయవాడకు రెండు అత్యాధునిక సరకు రవాణా నడవాలు