కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్.కృష్ణాపురం గ్రామానికి చెందిన వీఆర్ఏ కుమారి భర్త రమణ.. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు అతన్ని కాపాడారు. గ్రామ వీఆర్వో గోవిందరెడ్డి.. ఓ భూమి కొలతల విషయంలో తనను వేధిస్తున్నాడని రమణ ఆరోపించారు. జీతం నిలిపివేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పారు.
తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏ భర్త ఆత్మహత్యాయత్నం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మహిళా వీఆర్ఏ భర్త ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వీఆర్వో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు చెప్పారు.
తహసీల్దార్ ఆఫీస్ ఎదుట వీఆర్ఏ భర్త ఆత్మహత్యాయత్నం
అయితే... మహిళా వీఆర్ఏ స్థానంలో ఆమె భర్త రమణ విధులు నిర్వర్తిస్తున్నట్లు ఈ ఘటన ద్వారా బయటపడింది. ఈ రెండు ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ రమేశ్ రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి.
ప్రముఖ రచయిత వెల్చేరు నారాయణరావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
TAGGED:
Kurnool district latest news