ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది' - hike

కూరగాయల ధరలు కొండెక్కి.. దిగిరానంటున్నాయి. 5 వందల రూపాయల నోటు తీసుకుని మార్కెట్‌కు వెళితే... సంచి నిండటం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా... ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇది ఇలానే కొనసాగితే... ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'

By

Published : Jul 19, 2019, 2:01 PM IST

'కూరగాయలు కొనాలంటే భయంగా ఉంది'

ఆకుకూరలు,కూరగాయల ధరలు కర్నూలు జిల్లా ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు గణనీయంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం.జిల్లాలో ఖరీఫ్‌లో కూరగాయల సాగు సుమారు40వేల హెక్టార్లు.రబీలో2వేల500ఎకరాల్లో సాగు చేస్తారు.కోడుమూరు,గోనెగండ్ల,ఎమ్మిగనూరు,ఆదోని,డోన్‌,ఆస్పరి,నందికొట్కూరు పరిధిలో కూరగాయలను అధికంగా సాగు చేస్తున్నారు.ఏటా10శాతం పెరగాల్సిన సాగు వర్షాభావం వల్ల.....ప్రస్తుతం3వేల400హెక్టార్లకే పరిమితమైంది.

పత్తికొండ,ఆలూరు నియోజకవర్గాల్లో టమోటా ఎక్కువగా పండిస్తారు.బెండ,బీర,కాకర,క్యారెట్‌,క్యాబేజీ,బంగాళదుంప,మిర్చి లాంటి అన్ని రకాల కూరగాయలనూ జిల్లాలో పండిస్తున్నారు.స్థానిక అవసరాలు తీరగా...మిగిలినవి హైదరాబాద్,బెంగళూరు,చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.ఈ ఏడాది ఖరీఫ్‌లో పూర్తిగా సాగు తగ్గిపోవటం వల్ల...పరిస్థితి తారుమారైంది.స్థానిక అవసరాలు తీర్చుకునేందుకే ఇతర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు.బంగాళదుంప ఆగ్రా నుంచి దిగుమతి చేసుకుంటుండగా....క్యారెట్‌,బీన్స్‌,బీట్‌రూట్‌ వంటివి బెంగళూరు నుంచి.....ఉల్లి మహారాష్ట్ర,టమోటా మదనపల్లి,పుంగనూరు నుంచి తీసుకొచ్చి మార్కెట్లలో విక్రయిస్తున్నారు.

రైతుల నుంచి కూరగాయలు సాగు పడిపోవడం వల్లే ధరలు పెరిగాయని....మరో వారం రోజుల్లో అదుపులోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని8రైతుబజార్లలోనూ అధికారుల పర్యవేక్షణ లేనందున.....దళారులే రాజ్యమేలుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.దీని వల్ల ధరలు మరింత పెరిగాయని వినియోగదారులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details