కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు ప్రజలను.. పారిశుద్ధ్య లోపాలు కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమస్యపై బాధిత ప్రజలు.. వినూత్న రీతిలో నిరసన తెలిపారు. గ్రామంలోని పెద్దమ్మచావిడి వద్ద కొద్ది పాటి వర్షానికే నిల్వ ఉన్న మురుగునీరు, వర్షపు నీటిలో వరి నాట్లు వేశారు. తమ ప్రాంతంలోని దుస్థితని ఇప్పుడైనా అర్థం చేసుకోవాలంటూ ఆవేదన చెందారు. కొన్నేళ్లుగా.. చిన్నపాటి జల్లులకే ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నామని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
మురుగు నీటిలో వరి నాట్లు.. ఎందుకు?.. ఎక్కడ? - roads
పారిశుద్ధ్య లోపంపై కర్నూలు జిల్లా ముత్యాలపాడు గ్రామస్తులు వినూత్నంగా నిరసన తెలిపారు. మురుగురనీరు పారుదల తీరును ఎండగట్టారు.
వినూత్న నిరసన