ఓ మహిళ ఉపాయం... కోతుల బెడద మాయం..! - monkey problems in allagadda
ఏదైనా సమస్య ఉంటే దాని వెనుకే పరిష్కారమూ ఉంటుంది. కావాల్సిందల్లా కాసింత ఆలోచన. ఓ మహిళ కూరగాయలను బయట ఆరబెడుతుంటే కోతులు వాటిని నాశనం చేస్తున్నాయి. దీనిపై ఆలోచించిన ఆ మహిళ ఓ చిన్న ఉపాయంతో కోతులను పారిపోయేలా చేసింది. మరి ఆ ఆలోచనేంటో మనమూ చూద్దామా..!
ఓ మహిళ ఉపాయం... కోతుల బెడద మాయం
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఓ మహిళ వినూత్న ఆలోచన ఆమెకు కోతుల బెడద నుంచి దూరం చేసింది. పట్టణానికి చెందిన రాజేశ్వరి అనే మహిళ కూరగాయలను ఆరబెట్టేది. అయితే కోతులు మూకుమ్మడిగా దాడులు చేసి వాటిని నాశనం చేసేవి. దీనిపై ఆలోచించిన ఆ మహిళ బయట కూరగాయలను ఆరబెట్టి.. దానిపై పాము బొమ్మను ఉంచింది. అంతే అది నిజమైన పాము అనుకొని... కోతులు పరుగు లంకించుకుంటున్నాయి.