సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ చిన్న వీరభద్రుడ్ని సస్పెండ్ చెయ్యాలని కర్నూలులో డిమాండ్ ప్రజా సంఘల నాయకులు చేశారు. అవినీతిరహిత పాలన అందిస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అవినీతి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తున్నారని విమర్శించారు.
గతంలో ఐటీడీఏ పీడీగా పనిచేసిన చిన్న వీరభద్రుడు అవినీతికి పాల్పడినట్లు విజులెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తేల్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం జగన్ను ప్రశ్నించారు. ఇలాంటి అధికారికి ఐఏఎస్ హోదా ఇచ్చి సర్వశిక్షా అభియాన్లో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించారన్నారు.