కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం మాదాసుపల్లిలో అక్రమంగా తరలిస్తున్న 100 లీటర్ల నాటుసారాను బనగానపల్లె పోలీసులు పట్టుకున్నారు. మంగంపేట తండా నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తుండగా ముందస్తు సమాచారం మేరకు నాటుసారాను స్వాధీనం చేసుకొని, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి తెలిపారు.
నాటు సారా అక్రమ రవాణా..ఇద్దరు అరెస్టు
నాటుసారాను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కర్నూలు జిల్లా మాదాసుపల్లిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి వంద లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కృష్ణమూర్తి వెల్లడించారు.
నాటుసారా అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులు అరెస్టు