కర్నూలు జిల్లా నంద్యాల ఎన్జీఓ కాలనీకి చెందిన ఓ వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు.
పట్టణంలో కోటవీధికి చెందిన అదిల్ బాషా పాతిమానగర్లో ఉంటున్నాడు. అదిల్ బాషా, అతని మిత్రుడితో కలిసి జనవరిలో ఎన్జీఓ కాలనీలోని ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న వివాహితపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మార్చి మూడో తేదీన వారిని అరెస్టు చేశారు.