ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామికి తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు తితిదే ఛైర్మన్ దంపతులకు మంత్రక్షింతలు ఇచ్చి ఆశీర్వదించారు. జేఈవో ధర్మారెడ్డి దంపతులు మూల బృందావనం దర్శించుకొని పూజలు చేశారు.
రాఘవేంద్రస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన తితిదే ఛైర్మన్ - మంత్రాలయాన్ని సందర్శించి తితిదే ఛైర్మన్
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి వారిని తితిదే ఛైర్మన్ దంపతులు దర్శించుకున్నారు. మూల బృందవనానికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
mantralayam temple kurnool district