ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీశైలంలో దర్శనాల ట్రయల్ రన్ ప్రారంభం - శ్రీశైలం టెంపుల్ న్యూస్

శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారి దర్శనాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సంబంధించిన ట్రయల్ రన్​ను అధికారులు ప్రారంభించారు. దేవాదాయ శాఖ సూచించిన మార్గదర్శకాల ప్రకారం... ఉద్యోగులు మాస్కులు ధరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకున్నారు.

Trial Run start in Srisailam at kurnool district
Trial Run start in Srisailam at kurnool district

By

Published : Jun 8, 2020, 2:56 PM IST

శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దర్శనాలు పున:ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ సిబ్బందిని దర్శనానికి అనుమతిస్తున్నట్టు ఈవో రామారావు తెలిపారు. 10వ తేదీ నుంచి భక్తులందరినీ అనుమతిస్తామన్నారు. మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతిస్తున్నట్లు చెప్పారు. విగ్రహాలను తాకకుండా... భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకోవాలని కోరారు.

భక్తుల కోసం శానిటైజర్లను అందుబాటులో పెట్టామన్నారు. 10 నుంచి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు ఆన్​లైన్​లో ఉచిత టికెట్లను తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. స్లాట్ పద్ధతిలో భక్తులకు టిక్కెట్లను మంజూరు చేయనున్నామని.. 10 స్లాట్​లను దర్శనార్థం అందుబాటులో ఉంచామనీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details