Gold Theft: పట్టపగలే ఇద్దరు దొంగలు బంగారం దుకాణంలో చోరీకి పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర జ్యూవెలరీ దుకాణం యజమాని శ్రీనివాసులు.. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లాడు.
ఆ సమయంలో తన కుతూరు శృతిని దుకాణంలో ఉంచాడు. ఇంతలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. దుకాణంలో అమ్మాయి ఒక్కతే ఉన్నట్లు గమనించి లోపలికి వెళ్లి చోరికి పాల్పడ్డారు.