ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంకాలమ్మ ఆలయంలో చోరీ - kurnool updates

దేవాలయంలో హుండీ పగలగొట్టి...నగదు ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో చోటుచేసుకుంది.

theft-in-ankalamma-temple-at-muthialapadu
అంకాలమ్మ ఆలయంలో చోరీ

By

Published : Jan 8, 2021, 7:24 AM IST

కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో అంకాలమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గురువారం ఉదయం ఆలయంలోకి వెళ్ళిన భక్తులు హుండీ పగలగొట్టిన దృశ్యాలను గమనించారు. దీంతోపాటు అమ్మవారిపై ఉన్న వెండి ఆభరణాలు మాయమవ్వడం చూసి.... సమాచారాన్ని గ్రామ పెద్దలకు తెలిపారు. వెంటనే సమాచారం తెలుసుకున్న ఎస్సై వీరయ్య తమ సిబ్బందిని ఆలయానికి పంపించి...వివరాలు సేకరించారు.

ఆలయానికి తాళం వేయకపోవడంతో అగంతకుడు లోపలికి వెళ్లి హుండీని పగలగొట్టి దొంగతనం చేశారని ఎస్సై అన్నారు. అందులో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపినట్లు ఎస్సై చెప్పారు. ఆభరణాల మాయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని... హూండీ పగలగొట్టడం మినహా అక్కడ ఏ ఘటన జరగలేదని ఆయన వివరించారు. మండల పరిధిలోని అన్ని ఆలయాల్లో భద్రత చర్యలు పర్యవేక్షించాలని తమ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశామన్నారు.

ABOUT THE AUTHOR

...view details