కర్నూలు జిల్లాలోని తెలంగాణ-ఆంధ్ర సరిహద్దును కలిపే నందవరం మండలంలోని నాగులదిన్నె వంతెన మద్యం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. అవతల వైపున ఉన్న తెలంగాణ గ్రామాల నుంచి కొందరు ద్విచక్రవాహనాలపై మద్యాన్ని తెచ్చి ఇక్కడివారికి అమ్మి సొమ్ముచేసుకుంటున్నారు. నిత్యం ఈ తంతు జరుగుతున్నా ఎవరికీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మందుబాబులు అక్కడి వెళ్లి నిరీక్షిస్తే ఆ దారి వెంట ఎవరో ఒకరు వచ్చి వారికి మద్యం విక్రయిస్తున్నారు. మరికొందరు పూటుగా తాగి అసంపూర్తిగా ఉన్న వంతెన చివరన ప్రమాదకరంగా పడుకుంటున్నారు. మందుబాబులు ఇక్కడే తిష్ట వేయడంతో ఆ ప్రాంతం నుంచి వెళ్లాలంటే భయంగా ఉందని మహిళలు వాపోతున్నారు.
మద్యానికీ.. మందుబాబులకూ ‘వారధి’! - కర్నూలులో మద్యం అక్రమ రవాణా
కర్నూలు జిల్లాలోని తెలంగాణ - ఆంధ్ర సరిహద్దును కలిపే నందవరం మండలంలోని నాగులదిన్నె వంతెన వద్ద మద్యం అక్రమ రవాణా యదేచ్ఛగా జరుగుతోంది. తెలంగాణ గ్రామాల నుంచి కొందరు ద్విచక్రవాహనాలపై మద్యాన్ని తెచ్చి ఇక్కడివారికి అమ్ముతున్నారు.
naguladinney