కర్నూలు జిల్లా ఆదోని రైతు బజార్లో సబ్సిడీపై ఉల్లి పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. మార్కెట్లో కొరత వల్ల సబ్సిడీ కేంద్రాల వద్ద అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టారు. బహిరంగ మార్కెట్లో ఉల్లి కిలో వంద రూపాయలు పలుకుతోంది. ప్రభుత్వం కిలో రూ.25కే ఇస్తున్న కారణంగా... ప్రజలు ఆయా కేంద్రాలకు తరలివస్తున్నారు. నో స్టాక్ బోర్డు చూసి వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సబ్సిడీపై ఉల్లి పంపిణీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
సబ్సిడీ కేంద్రంలో.. ఉల్లిపాయలు లేవు! - Subsidy onion shortage in Adoni farmer bazaar no stock board newsupdates
ఆదోని రైతు బజార్లోని ఉల్లి సబ్సిడీ కేంద్రాల వద్ద అధికారులు నో స్టాక్ బోర్డు పెట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆదోని రైతుబజార్లో సబ్సిడీ ఉల్లి కొరత..నో స్టాక్ బోర్డు