కర్నూలు జిల్లా ఆదోనిలో విద్యార్థులు వర్షంలోనే ధర్నా చేశారు. రెండు గంటలు ఎదురు చూసినా... తమ గ్రామాలకు రావల్సిన ఆర్టీసీ బస్సులు రాకపోవటంతో బస్టాండ్ వద్ద విద్యార్థులు పెద్దసంఖ్యలో చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీనితో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు బస్సులను ఏర్పాటు చేయటంతో సమస్య పరిష్కారమైంది.
బస్సులు లేక.. వర్షంలోనే విద్యార్థుల ఆందోళన - adoni
రెండు గంటలు ఎదురుచూసినా.. తమ గ్రామాలకు రావల్సిన బస్సులు రాకపోవటంతో ఆదోనిలో విద్యార్థులు వర్షంలోనే ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ అధికారులు బస్సులను పంపటంతో ఆందోళన విరమించారు.
విద్యార్థుల ఆందోళన