ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వసతి గృహంలో ఇబ్బందులు.. రోడ్డెక్కిన విద్యార్థులు

ప్రభుత్వ వసతి గృహంలో ఇబ్బందులపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భోజన పాత్రలు, ప్లేట్లతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

student-darna-for-food-quality

By

Published : Jul 6, 2019, 2:55 PM IST

వసతి గృహంలో ఇబ్బందులపై విద్యార్థుల ధర్నా

వసతి గృహంలో నాణ్యమైన భోజనం అందించడం లేదంటూ విద్యార్థులు రోడ్డుపై ఆందోళన నిర్వహించారు. కర్నూలు జిల్లా బనగానపల్లెలో ప్రభుత్వ కళాశాల ఎస్సీ వసతి గృహం విద్యార్థులు భోజన పాత్రలు, ప్లేట్లతో పెట్రోల్ బంకు కూడలిలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉడకని అన్నం, నీళ్ల పప్పుతో నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని వాపోయారు. వసతి గృహం ఊరి బయట ఉండడం వల్ల రాత్రివేళల్లో విషసర్పాలు వస్తున్నాయని, వసతి గృహానికి వార్డెన్ పర్యవేక్షణ లోపించిందని తెలిపారు. వసతి గృహం నుంచి ర్యాలీగా పెట్రోల్ బంక్ కూడలికి చేరుకున్న విద్యార్థులు అక్కడ ఆందోళన నిర్వహించి... అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details